శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (11:25 IST)

చిత్తూరు జిల్లాలో టమోటా ధర ఎంతో తెలుసా?

నాలుగైదు రూపాయలకే కిలో టమోటా దొరికే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు దాని ధర ఆకాశానికి చేరుకుంది. జిల్లాలోని మార్కెట్లలో టమోటా ధరలు అమాంతం పెరిగాయి.

బుధ, గురువారాల వరకు కిలో రూ.30నుంచి రూ.45 వరకు పలికిన టమోటాలు ఏకంగా రూ. 70కు చేరాయి. మదనపల్లె మార్కెట్‌లో 30కిలోల బాక్సు ధర రూ. 2వేలు పలికింది.

గుర్రంకొండలోనూ రూ. 1800 నుంచి రూ. 2వేల వరకు అమ్ముడుపోయాయి. కలకడలో 15కిలోల బాక్సు రూ.800 నుంచి రూ.వెయ్యికి పైగా పలికింది. ఇక రీటైల్‌ మార్కెట్లలో కొండెక్కాయి.

పీలేరులోని రీటైల్‌ మార్కెట్‌లో శనివారం కిలో టమోటాలు రూ.75 పలికాయి. కలికిరిలో రూ. 65, వాల్మీకిపురంలో రూ. 60, కలకడలో రూ. 70 పలికింది.