1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 29 డిశెంబరు 2021 (18:41 IST)

అక్రమ మైనింగ్ వల్లే శాంతిపురం క్వారీలో పేలుళ్లు!

చిత్తూరు జిల్లా  శాంతిపురం మండలం సోమపురం క్వారీలో బుధవారం జరిగిన పేలుడు ఘటనను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అక్రమ క్వారీయింగ్ నిర్వహించడం వల్లే తరచూ ఇటువంటి ఘటనలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. క్వారీలో నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించారు. 
 
 
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అక్రమమైనింగ్ చేస్తున్న వైసీపీ నేతల ధన దాహానికి కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవరం పేలుళ్లలో మృతి చెందిన గోవిందప్పకు చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేలుళ్లలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున మెరుగైన వైద్య సహాయంతోపాటు పరిహారం అందించాలని విజ్జప్తి చేశారు.