గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (13:25 IST)

కోడి పందాలు: కోడి కాలికి కట్టిన కత్తి తగిలి వ్యక్తి మృతి

సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాలు ఇంకా ఏపీలో జరుగుతూనే వున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంకా కోడి పందాలు ఆగలేదు. కోడిపందాలు సంక్రాంతి సంప్రదాయం అంటూనే పండుగ వెళ్లిపోయినా సంప్రదాయం ముసుగులో ఈ పందాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని పెద్ద మండ్యం మండలం కలిచర్ల గ్రామంలో అపశృతి చోటుచేసుకుంది. 
 
కోడి పందాలు జరుగుతుండగా చుట్టూ చేరిన జనాలపైకి ఓ పందెం కోడి దూసుకొచ్చింది. అలా దూసుకొచ్చిన కోడి కాలికి కట్టిన కత్తి తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తికి తీవ్ర రక్తస్రావం ప్రాణాలు కోల్పోవటంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది.
 
మృతి చెందిన వ్యక్తి చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచర్ల గ్రామంలో గంగులయ్య అని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.