మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (20:07 IST)

కొత్త జిల్లా కోసం బాలకృష్ణ హిందూపురంలో ర్యాలీ

సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహిరంచనున్నారు. ఆయన టీడీపీ కార్యకర్తలు, హిందూపురం ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. 
 
శుక్రవారం ఉదయం హిందూపురంలో ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. పట్టణంలోని శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగనుంది. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌనదీక్షకు దిగుతారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణపై ఆయన ఉద్యమ నేతలతో చర్చిస్తారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.