శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (11:08 IST)

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మిస్సింగ్!

సినీ నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదు. ఈ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా వాల్‌పోస్టర్లు అంటించారు. అలాగే, అనంతపురం ఎంపీ గోరట్లం మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కూడా కనిపించడం లేదని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారంతా కలిసి శనివారం ఒకటో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
ఈ సందర్భంగా బీజేపీ నేతలు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరు కూడా కనిపించడం లేదు, స్పందించడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ ముగ్గురు ఎక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం చేయాలని, అలాగే ఈ ముగ్గురి ఆచూకీ తెలుసుకోవాలని వారు కోరారు. అంతేకాకుండా, ఈ ముగ్గురు నేతలు తక్షణం తమతమ పదవులకు రాజీనామా చేసి హిందూపురం కోసం జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేశారు.