శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (14:00 IST)

కరోనా వైరస్ బారినపడిన హీరో శ్రీకాంత్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరో శ్రీకాంత్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా బుధవారం ఉదయం కోరనా వైరస్ బారినపడినట్టు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి హీరో శ్రీకాంత్ కూడా ఈ వైరస్ బారినపడ్డారు 
 
"ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనని కరోనా వదిలిపెట్టలేదు. తాజాగా కోవిడ్ పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయింది అని ప్రకటించారు. అలాగే, తనతో కాంటాక్ట్ అయిన వారంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. 
 
చిరంజీవిని కోవిడ్ పాజిటివ్ 
మెగాస్టార్ చిరంజీవికి కరోనా వైరస్ మరోమారు సోకింది. మంగళవారం నుంచి స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
కాగా, ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, త్వరలోనే కోలుకుని మిమ్మలను కలుస్తానని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 
 
గతంలో కూడా చిరంజీవి కరోనా వైరస్ బారినపడ్డారు. అపుడు కూడా హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి ఇంటి పనిమనిషికి తొలుత వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి ఇంట్లోని పలువురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మెగా బ్రదర్ నాగబాబు, హీరో పవన్ కళ్యాణ్ కూడా ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే.