ఓరి వీడి దుంపతెగ, టెస్ట్ డ్రైవ్ అంటూ బెంజ్ కారుతో జంప్
టెస్ట్ డ్రైవ్ అంటూ ఖరీదైన బెంజ్ కారును నడుపుకుంటూ వెళ్లిపోయాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత కారు యజమాని అతడి కోసం ఎంత ప్రయత్నించినా అతడు తప్పించుకోసాగాడు. చివరికి ఎలాగో ఆచూకి తెలుసుకుని గట్టిగా నిలదీశాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 2024 డిశెంబరులో అక్బర్ ఖాన్ అనే వ్యక్తి అహ్మద్ నుంచి మెర్సిడెస్ బెంజ్ కారును కొనుక్కునేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఒకసారి కారును టెస్ట్ డ్రైవ్ చేసి చూస్తానని చెప్పి దాన్ని నడుపుకుంటూ వెళ్లిపోయాడు.
ఆ తర్వాత కారు యజమాని ఎలాగో అతడి వద్దకెళ్లి నిలదీయగా రూ. 25 లక్షలు ఇస్తానని అంగీకరించాడు. ఐతే ఆ డబ్బు ఇవ్వకుండా ఏకంగా కార్స్ గలోర్లతో కలిసి కారును అమ్మేశాడు. ఆ తర్వాత రెండున్నర లక్షలు యజమాని చేతిలో పెట్టి దాంతో సరిపెట్టుకోవాలని అన్నాడు. మిగిలిన మొత్తం కూడా ఇవ్వాలంటూ గట్టిగా నిలదీయడంతో కారు యజమానిని బెదిరించాడు. దీనితో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాదు నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం.