1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Megastar Chiranjeevi Tests Positive for Covid 19

చిరంజీవిని మరోమారు కుట్టిన కరోనా వైరస్

Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి కరోనా వైరస్ మరోమారు సోకింది. మంగళవారం నుంచి స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
కాగా, ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, త్వరలోనే కోలుకుని మిమ్మలను కలుస్తానని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 
 
గతంలో కూడా చిరంజీవి కరోనా వైరస్ బారినపడ్డారు. అపుడు కూడా హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి ఇంటి పనిమనిషికి తొలుత వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి ఇంట్లోని పలువురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మెగా బ్రదర్ నాగబాబు, హీరో పవన్ కళ్యాణ్ కూడా ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. 
తర్వాతి కథనం
శ్రియా సరన్ మ్యూజిక్ స్కూల్ ను శానిటైజ్ చేశారు