గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (15:51 IST)

హాయిగా న‌వ్వుకునేలా వుండేదే మా సెహ‌రి సినిమా - ద‌ర్శ‌కుడు జ్ఞానసాగర్‌ ద్వారక

Director Jnanasagar Dwarka
హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. వర్గో పిక్చర్స్ ప‌తాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన‌ ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు జ్ఞానసాగర్‌ ద్వారక సెహ‌రి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఈ విధంగా తెలియ‌జేశారు.
 
- ఈ చిత్ర క‌థ అనుకున్న‌ప్పుడు సెహ‌రి అనే పేరు అనుకున్నాం. 2009లో ఓయి సినిమాలో సెహ‌రీ సాంగ్ చాలా ఫేమ‌స్‌. యువ‌న్ శంక‌ర్‌రాజా బాణీలు విన్నాను. మా క‌థ‌కు మంచి టైటిల్ అనిపించింది. నేను, నిర్మాత‌, హీరో క‌లిసి 10 రోజులు చ‌ర్చించుకుని టైటిల్ ఫైన‌ల్ చేశాం. సెహ‌రీ అంటే  సెల‌బ్రేష‌న్స్ అని అన్ని భాష‌ల్లో అర్థం వుంది.
- చిత్తూరుజిల్లా  వి.కోట మా స్వ‌స్థ‌లం. ఎం.ఎస్‌.సి. కంప్యూట‌ర్స్ చేశా. జాబ్ చేయ‌కుండానే సినిమాల‌పై ఆస‌క్తితో డ్రీమ్ మ‌ర్చంట్ అనే ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీలో అసిస్టెంట్ చేశా. అలా ప‌లు కంపెనీలకు ప‌నిచేశాను. యాడ్ ఫిలింమేక‌ర్‌గా చేయ‌డంతో విజువ‌ల్ ట్రీట్‌గా సినిమాను ఎలా తీయ‌వ‌చ్చో నాకు ప్ల‌స్ అయింది.
- నేను ఆరేళ్ళుగా యాడ్ ఫిలిం మేక‌ర్‌గా వున్నా. కాంటినెంట‌ల్‌ కాఫీ, గీతాంజ‌లి వంటి ప‌లు యాడ్స్ చేశాను. అలా చేయ‌డం వ‌ల్లే కొత్త‌గా సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం చాలా సులువు అయింది.
-  హీరో హ‌ర్ష్ పుట్టిన‌రోజునాడు హీరో లుక్‌ను బాల‌య్య‌బాబుగారిచేత ఆవిష్క‌రించాం. అప్ప‌టినుంచి సినిమాకు హైప్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత క‌రోనా వ‌ల్ల న‌టీన‌టుల డేడ్స్ ఇబ్బంది, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డం జ‌రిగింది. 
 
- ఈ క‌థ‌ను హ‌ర్ష్ రాసుకున్నాడు. రామ్ కామ్ అన‌గానే బోల్డ్ కంటెంట్ వుంటుంద‌నుకున్నా. కానీ ఇది క్లీన్ ఫిలిం. క‌థ విన‌గానే చేస్తాన‌ని చెప్పేశాను. ఒక‌ర‌కంగా యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యేక‌థ‌.
- క‌థ‌ప‌రంగా చెప్పాలంటే, 20 ఏళ్ళ వ‌య‌స్సులో ప‌రిప‌క్వ‌త లోపించి ఏం చేయాలో తెలీని గంద‌ర‌గోళంలో వున్న కుర్రాడి క‌థ‌. ఇది అంద‌రినీ జీవితాల్లోనూ వుండేది. ఆ టైంలో ఓ అమ్మాయిని ప్రేమించ‌డం త‌ర్వాత బ్రేక‌ప్ కావ‌డం, ఫైన‌ల్‌గా పెండ్లి చేసుకోవాల‌ని ఫిక్స్ అవ్వ‌డం జ‌రుగుతుంది. కానీ ఆ టైంలోపెళ్లికూతురు అక్క‌తో ల‌వ్‌లో ప‌డ‌తాడు. దాన్ని ఎలా ఎంట‌ర్‌టైన్ లో చెప్పామ‌నేది సినిమా. ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. థియేట‌ర్‌లోకి వ‌చ్చిన ప్రేక్ష‌కుడిని మూడు నిముషాల్లో సెహ‌రీ లోకంలోకి తీసుకెళుతుంది. బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు చెర‌గ‌ని న‌వ్వుతో బ‌య‌ట‌కు వ‌స్తారు.  
 
- నేను అంద‌రి ద‌ర్శ‌కుల నైపుణ్యం గ‌మ‌నిస్తాం. త్రివిక్ర‌మ్‌, రాజ‌మౌళి వంటి వారి సినిమాల్లో డిజైనింగ్‌లో మంచి క‌ల‌ర్స్ వాడి విజువ‌ల్ ట్రీట్‌లా చూపిస్తారు. నాకు అలాంటివే ఇష్టం. అందుకే మా సెహ‌రి సినిమా విజువ‌ల్ ట్రీట్‌గా వుంటూ ఎంట‌ర్‌టైన్ మెంట్ చాలా ఇస్తుంది.
- అయితే యాడ్‌ఫిలింలో 30 సెక‌న్ల‌లో ఆర్టిస్టు మూడ్‌ను కేరీచేస్తూ తీసేస్తాం. కానీ సినిమాకు అలా కుద‌ర‌దు. ఒక‌సారి ఆర్టిస్టులతో ఓ సీన్ చేశాక‌, దాని కొన‌సాగింపు మ‌రో రోజు తీయాలంటే ఆ మూడ్ కేరి చేయ‌డానికి టైం ప‌డుతుంది. పైగా యాడ్ ఫిలిం చేయ‌డం వ‌ల్ల సినిమా మేకింగ్ ఫాస్ట్ గా ఎలా తీయ‌వ‌చ్చో అనేది తెలిసింది.  
- ఈ సినిమాకు సంగీతంతోపాటు అర‌వింద్ విశ్వ‌నాథ్ కెమెరామెన్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. త‌ను మూడ్‌కు అనుగుణంగా లైటింగ్ పెట్టాడు. ఎడిట‌ర్ కూడా `ఈ న‌గ‌రానికి ఏమైంది` వంటి స‌క్సెస్ సినిమాలకు ప‌నిచేశాడు.
- నాకు అన్ని జోన‌ర్స్ ఇష్టం. నా ద‌గ్గ‌ర పీరియాడిక్ డ్రామా కూడా వుంది. అయితే హ‌ర్ష్‌తోనే మ‌రో సినిమా చేయ‌బోతున్నా. ప్రీప్రొడ‌క్ష‌న్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు తెలియ‌జేస్తాను అని తెలిపారు.