ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (15:47 IST)

ధోనీ సరికొత్త అవతారం : "అథర్వ" పేరుతో వెబ్ సిరీస్

ఇప్పటివరకు ఒక క్రికెటర్‌గా కనిపించిన మహేంద్ర సింగ్ ధోనీ ఇపుడు ఓ అతీయశక్తులు కలిగిన సూపర్ హీరోగా చూడబోతున్నాం. పముఖ తమిళ రచయిత రమణ కలం నుంచి జాలువారిన నవలను ఆధారంగా గ్రాఫిక్ నవలను క్రియేట్ చేయనున్నారు. అంటే ఓ వెబ్ సిరీస్‌గా గ్రాఫిక్ నవలగా రూపొందించనున్నారు. 
 
"అథర్వ - ద ఆరిజన్" పేరుతో తెరకెక్కే ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో రాక్షస సంహారం చేస్తున్న యోధుడిగా ధోనీ కనిపిస్తున్నారు. ఆ ఫస్ట్ లుక్‌, టీజర్‌ను ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, ట్విట్టర్‌ ఖాతాల్లో షేర్ చేశారు. 
 
గతంలో ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా "ఎంఎస్ ధోనీ : ద అన్ టోల్డ్ స్టోరీ" పేరుతో వెండితెర దృశ్యకావ్యం వచ్చిన విషయం తెల్సిందే. ఇందులో ధోనీ పాత్రను బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇపుడు అథర్వగా ధోనీనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.