గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (09:24 IST)

పాకిస్థాన్ క్రికెటర్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాకిస్థాన్ క్రికెటర్‌కు స్పెషల్ గిప్ఠ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీష్ రవూఫ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని బహుమతిగా ఇచ్చాడు.
 
అందులో ధోనీ సంతకం కూడా ఉంది. ఈ జెర్సీ మరే ఇతర ఆటగాడిది కాదు, స్వయంగా ధోనీదే. జెర్సీ వెనుక ధోనీ నంబర్ ఏడో రాసి, ముందు భాగంలో ధోనీ స్వయంగా సంతకం చేశాడు. హరీష్ రవూఫ్ ఈ జెర్సీని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇంకా భావోద్వేగ పోస్ట్‌ చేస్తూ కృతజ్ఞతలు తెలిపాడు.
 
ధోనీ జెర్సీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రౌఫ్ ఇలా వ్రాశాడు - లెజెండరీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన అందమైన చొక్కాను బహుమతిగా ఇచ్చి నన్ను సత్కరించాడని చెప్పాడు. అలాగే హరీస్ రవూఫ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం సిద్ధమవుతున్నాడు .పీఎస్ఎల్ జనవరి 27 నుండి ప్రారంభమవుతుంది.