గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (00:01 IST)

అందుకే పాకిస్థాన్ ఆటగాళ్లు ధోనీ, కోహ్లీని కలిశారు.. వసీమ్ అక్రమ్

భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లు అందరూ కెప్టెన్ విరాట్ కోహ్లీని అలాగే ధోనిని కలిసిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే దీనిపై పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ...ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు అందరూ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానులు అని, అందుకే నిన్న మ్యాచ్ తర్వాత వారు కోహ్లీ, ధోనిని కలిశారు అని అన్నారు. 
 
ఇక భారత్‌, పాక్‌ ఆటగాళ్ల మధ్య స్నేహబంధం గురించి మాట్లాడుతూ.. ఈ పోటీని ప్రత్యర్థుల మధ్య జరిగే పోరుగా ప్రచారం చేసేది కేవలం అభిమానులు, మీడియా మాత్రమేనని. కానీ రెండు జట్లలోని ఆటగాళ్లకు ఒకరి మీద ఒకరికి ఎంతో గౌరవం, అభిమానం ఉన్నందున అక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఈ క్రీడలే ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తాయి అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు.