సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (15:45 IST)

ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ‌వుతున్న సెహరి

Harsh Kanumilli, Simran Chaudhary
హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. ఈ సినిమా టైటిల్‌తో పాటు, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది.
 
హీరో హర్ష్‌ అదిరిపోయే స్టెప్పులతో ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌ యూత్‌ఫుల్‌ ట్రాక్‌గా నిలువ‌గా..సెకండ్‌ సాంగ్‌ ‘ఇది చాలా బాగుందిలే’ పాట‌లో హర్ష్‌ తన అద్భుతమైన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో, తన అందమైన లుక్స్‌తో సిమ్రాన్ చౌద‌రి వెండితెరపై అదుర్స్‌ అనిపించారు.
 
అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హ‌ర్ష్ క‌నుమిల్లి ఈ చిత్రానికి క‌థా ర‌చ‌యితగా వ్య‌వ‌హ‌రించారు.  
 
ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 11న గ్రాండ్ గా  రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో వివిధ ర‌కాల ప్ర‌మోష‌న్స్ ను ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌.
 
ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండ‌గా అరవింద్‌ విశ్వనాథ్ సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తున్నారు.