విడుదలకు సిద్దమైన ట్యాక్సీ
Taxi poster
యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ 'ట్యాక్సీ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని చెబుతున్న చిత్ర బృందం ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అంతా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి ఒక్కొక్కటిగా అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు అదే బూస్టింగ్‌తో ట్యాక్సీ నుంచి 'వేవేలా తారల' లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్, రమ్య బెహరా పాడిన ఈ పాటలో హీరోహీరోయిన్స్ మధ్య షూట్ చేసిన సన్నివేశాలు, మ్యూజిక్ హైలైట్ అవుతున్నాయి. ప్రేమికుల ఫీలింగ్స్ తెలిసేలా కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ పాటతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
