సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (13:25 IST)

నన్ను కౌగిలించుకోండ‌ని ఆఫర్ ఇస్తున్న ప్రియాంక జ‌వాల్క‌ర్

Priyanka Jawalkar
ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అన్న కాన్‌సెప్ట్ త‌ర‌హాలో  ఎవరు నన్ను కౌగిలించుకోవాలను కుంటున్నారు! అంటూ ప్రియాంక జువాల్క‌ర్ అడుగుతోంది. డైరెక్ట్‌గా ఓ ఫోజ్ ఇచ్చి అంద‌రికీ ఆఫ‌ర్ చేసిన‌ట్లున్న ఈ ఫొటోను త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి బాగానే కామెంట్లు వ‌చ్చాయి.  లీలా అనే అభిమాని మాత్రం క్యూట్ అంటూ స్పందిస్తే మ‌రికొంద‌రు ఒన్‌సైడేనా అంటూ చిలిపి కామెంట్లు చేశారు.
 
అయితే మొద‌ట్లో త‌ను బాగా లావుగా వుండేదానిన‌నీ, థైరాయిడ్‌, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాద‌ప‌డ్డాన‌ని చెబుతోంది. టాక్సీవాలా, ఎస్‌.ఆర్‌. క‌ళ్యాణ‌మండం సినిమాలు చేసిన ఆమె కొత్త‌గా `గ‌మ‌నం` అనే సినిమా చేసింది షూట్ పూర్త‌యింది. కాగా, ఓ హిందీ వెబ్ సీరిస్‌కు ఇటీవ‌లే ఆడిష‌న్ ఇచ్చింది. ఆ సంద‌ర్భంగా ఇలా ఫోజ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. గ్లామ‌ర్ పాత్ర‌కు సిద్ధ‌మే అయినా పాత్ర‌ప‌రంగా అవ‌స‌రం అనుకుంటే చేస్తాన‌ని ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. సో. వెబ్‌సిరీస్‌లో గ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.