శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (12:58 IST)

ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

ప్రముఖ యాంకర్, న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదలకానున్నారు. 
 
ఓ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను గత ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
అదేసమయంలో తెరాస ప్రభుత్వంపై అనేక విమర్శలు కూడా గుప్పించారు. దీంతో తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదైవున్నాయి. వీటిలో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. మిగిలిన ఒక్క కేసులో కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
కాగా, తీన్మార్ మల్లన్న గత 74 రోజులు జైల్లో ఉన్నారు. కాగా తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య ఇటీవల హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా మల్లన్నకు బెయిల్ మంజూరైంది.