NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం
Hrithik Roshan, N.T.R. 25 years old poster
25వ నెంబర్ ఇద్దరు హీరోలకు చాలా ప్రాధాన్యమైంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, తెలుగు హీరో తారక్ (ఎన్.టి.ఆర్.) లకు వారసత్వంగా వచ్చిన నటనకు 25 ఏళ్ళయ్యాయి. ఈ సందర్భంగా జులై 25న వార్ 2 సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఐకాన్‌లలో ఇద్దరు హృతిక్, తారక్ 25 సంవత్సరాల సినిమా వారసత్వాన్ని జరుపుకోనున్నారని తెలిపింది.
తెలుగులో హృతిక్ రోషన్ కు ఎంట్రీతోపాటు తారక్ (ఎన్.టి.ఆర్.)కు బాలీవుడ్ లో ఎంట్రీకి 25 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికే ఇరువురూ వేర్వేరుగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. అందుకే ఇద్దరినీ కలిపే డేట్ జులై 25 అవుతుందని తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్ లో వార్ 2 ఈ మూడు రోజుల్లో సందడి చేయనుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం ఆగస్ట్ 14న గ్రాండ్ గా యష్ రాజ్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నారు.