శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (12:43 IST)

ఛాన్సుల పేరుతో బాలికపై అత్యాచారం.. ఫన్‌ బక్కెట్ భార్గవ్‌కు మళ్లీ సంకెళ్ళు

టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్‌కు మళ్లీ సంకెళ్ళు పడ్డాయి. ఆయనకు మరోమారు కోర్టు రిమాండ్ విధించింది. అవకాశం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకుని అత్యాచారం చేసిన భార్గవ్‌పై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏప్రిల్ 18వ తేదీన అరెస్టు చేశారు. 
 
అయితే ఈ కేసులో జూన్ 15న షరతులతో పోక్సో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై బయటకు వచ్చాక షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను భార్గవ్ ఉల్లంఘించాడు. దీంతో భార్గవ్‌పై దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మెమో ఫైల్ చేశారు. 
 
ఈ కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్టు మెమోలో పొందుపరిచారు. దీంతో బెయిల్ రద్దు చేసిన పోక్సో కోర్టు ఈ నెల 11 వరకూ రిమాండ్ విధించింది. రిమాండ్‌‌లో భాగంగా ఫన్ బకెట్ భార్గవ్‌ చేతులకు సంకెళ్లు వేసిన సెంట్రల్ జైలుకు తరలించారు.