గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (18:00 IST)

`సెహ‌రి`హీరో హ‌ర్ష్ ని `వ‌ర్జిన్‌`అని బాల‌కృష్ణ ఎందుక‌న్నాడు!

Sehari still
హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌధ‌రి హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతోన్న`సెహ‌రి` మూవీ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ శుక్ర‌వారం విడుద‌ల‌చేసింది. ఈ బృందం ప్రత్యేకమైన ప్రమోషన్లు మరియు హర్ష్‌ను వర్జిన్ స్టార్ అని పిలిచే  ప్రకటన వీడియో `సెహ‌రి` టీజ‌ర్ మంచి రెస్పాన్స్ సంపాదించడానికి ఎంత‌గానోఉపయోగ‌ప‌డింది. వ్యూహాత్మకంగానే వారు బాలకృష్ట‌గారి ప్రసంగాన్నిసెహారీ టీజర్‌లో చేర్చ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.
 
బాలకృష్ణగారు గ‌తంలో హర్ష్ కనుమిల్లిని వర్జిన్ స్టార్ అని పేర్కొన్న విష‌యం తెలిసిందే.. అందుకే ఈ చిత్ర బృందం కూడా అదే ట్యాగ్ లైన్ ద్వారా అతన్ని పిలవాలని నిర్ణయించుకుంది. "మేము బాలకృష్ణ గారి ప్రసంగాన్నిసెహారీ టీజర్‌లో చేర్చాము. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు మేము కృత‌జ్ఞత‌లు తెలుపుతున్నాము" అని మేకర్స్ ప్ర‌క‌టించారు.
 
తన ప్రియురాలితో క‌లిసి ఆనందకరమైన జీవితాన్నిగడిపే వరుణ్ పాత్రలో హర్ష్ కనుమిల్లి క‌నిపించారు. ఒక్క‌సారిగా త‌న‌తో బ్రేక‌ప్ అవ‌డం, దాంతో మ‌రోక‌రితో వివాహానికి సిద్ద‌మ‌వ‌డం మ‌నం ఈ టీజ‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత త‌ను వివాహం చేసుకోబోయే అమ్మాయి అక్క సిమ్రాన్ చౌదరితో సన్నిహితంగా ఉండ‌డం ద్వారా త‌న భాగ‌స్వామి ఎంపిక సరైనది కాదని అతను గ్రహించడం టీజ‌ర్లో చూపించారు. హ‌ర్ష్ క‌నుమిల్లి కామెడి టైమింగ్ ఈ టీజ‌ర్‌కి మేజ‌ర్ హైలెట్ అని చెప్పొచ్చు. 
 
ద‌ర్శ‌కుడు జ్ఞాన సాగ‌ర్ ద్వారక సెహ‌రి`చిత్రాన్ని యూత్ ఫుల్ రామ్‌- కామ్‌ ఎలిమెంట్స్‌తో ఆహ్లాద‌కరంగా ‌తెర‌కెక్కించారు. ప్రశాంత్ ఆర్ విహారీ నేపథ్య సంగీతం ఆకర్షణీయంగా ఉంది.
 
శిల్ప చౌదరి భాగస్వామ్యంతో వ‌ర్గో పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా అద్వ‌య జిష్ణు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర పోషించారు. 
 
తారాగ‌ణం:
హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌధ‌రి, అభిన‌వ్ గోమటం, ప్ర‌ణీత్ రెడ్డి, అనీషా అల్ల, అక్షిత హ‌రీష్‌, కోటి, బాల‌కృష్ణ త‌దిత‌రులు
 
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కత్వం: జ్ఞాన సాగ‌ర్ ద్వారక‌,
నిర్మాత‌లు: అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌధ‌రి,
సినిమాటోగ్ర‌ఫి: సురేష్ సారంగం
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజ‌ల‌
సంగీతం: ప్ర‌శాంత్ ఆర్ విహారి
ఆర్ట్‌: సాహి సురేష్‌.