మాటకు కట్టుబడ్డ బాలకృష్ణ
Balakrishna
ఇక బోయపాటి సినిమా దాదాపు పూర్తీ కావొచ్చింది. ఈ సినిమా తరువాత అయన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో రచయిత ఎమ్ రత్నం, బాలయ్య కోసం ఓ కథను రాశాడని, ఇప్పటికే బాలయ్యకు కథ కూడా వినిపించడం జరిగిందని తెలిసింది. ఇందుకు కథ బాగా నచ్చడంతో బాలయ్య ఒకే చెప్పాడని సమాచారం. ఇది ఫుల్ యాక్షన్ నేపథ్యంతో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా వుంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో `డిక్టేటర్` సినిమా వచ్చింది. ఆ సినిమా చిత్రీకరణలో బాలయ్య శ్రీవాస్‌కు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడని అప్పట్లోనే తెలియజేశారు. 2016లో తీసిన ఆ సినిమా తర్వాత మరలా ఇన్నేళ్ళకు వీరి కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
