శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (20:33 IST)

మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జ‌యంతి సంద‌ర్భంగా 'మేజ‌ర్' గ్లిమ్స్ విడుద‌ల‌

Major still
ముంబై 26/11 టెర్ర‌రిస్ట్ దాడుల్లో ప‌లువురు పౌరుల్ని కాపాడి, త‌న ప్రాణాల్ని త్యాగం చేసిన 'నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్' (ఎన్ఎస్‌జి) క‌మాండో సందీప్ ఉన్నికృష్ణ‌న్ సాహ‌స జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం 'మేజ‌ర్‌'. టైటిల్ రోల్‌ను అడివి శేష్ పోషిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌ను శ‌శికిర‌ణ్ తిక్కా డైరెక్ట్ చేస్తున్నారు. 2021 జూలై 2న ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.
 
నేడు (మార్చి 15) సందీప్ ఉన్నికృష్ణ‌న్ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా 'మేజ‌ర్' చిత్ర బృందం ఓ వీడియో గ్లిమ్స్‌ను విడుద‌ల చేసింది. ఈ వీడియోలో ఒళ్లు జ‌ల‌ద‌రించే సీన్ ఉంది. అగ్ని కీల‌లు గ‌దిని మొత్తం ద‌హించివేస్తుండ‌గా, ఆ మంట‌ల మ‌ధ్య ఉన్నిక‌ష్ణ‌న్ పాత్ర‌ధారి అడివి శేష్ చేతిలో ఏకే 47 గ‌న్ ప‌ట్టుకొని నిల్చొని క‌నిపిస్తున్నాడు. ఒక ఆర్మీ ఆఫీస‌ర్, "సందీప్ నువ్వ‌క్క‌డ ఉన్నావా? అక్క‌డ ఎంత‌మంది ఉన్నారు? సందీప్ అక్క‌డ ఉన్నావా?" అని వైర్‌లెస్ సెట్‌ ద్వారా అడుగుతుంటే, సందీప్ నుంచి స‌మాధానం లేదు. అంటే.. ఆ మంట‌లు అప్ప‌టికే ఆయ‌న‌ను ద‌హించి వేస్తున్నాయ‌ని ఊహించ‌వ‌చ్చు. కానీ ఈ సీన్ క‌లిగించే ఇంప్రెష‌న్ మామూలుగా లేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ గ్లిమ్స్ విజువ‌ల్స్ సూప‌ర్బ్ అనిపిస్తున్నాయి. మార్చి 28న టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.
 
ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన ప్రి లుక్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు సినిమాపై ఆస‌క్తి క‌ల‌గించ‌గా, ఇప్పుడు విడుద‌ల చేసిన గ్లిమ్స్ 'మేజ‌ర్'‌పై అంచ‌నాల‌ను అమాంతంగా పెంచేసింది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ‌, స‌యీ మంజ్రేక‌ర్ కీల‌క పాత్రలు చేస్తున్నారు.
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు చెందిన జి మ‌హేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చ‌ర్స్‌, ఏ+ఎస్ మూవీస్ బ్యాన‌ర్స్ క‌లిసి 'మేజ‌ర్' మూవీని నిర్మిస్తున్నాయి.