మంగళవారం, 16 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 డిశెంబరు 2025 (20:59 IST)

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

rising summit
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు రాగా, ఒప్పందాలు కూడా అదే స్థాయిలో కుదుర్చుకున్నారు. ఈ సదస్సు జరిగిన రెండు రోజుల్లో కలిపి వివిధ కంపెనీలు, పరిశ్రమలు రూ.5.75 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
వీటిలో రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వంతో ఇన్‌ఫ్రాకీ పార్క్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 150 ఎకరాల్లో 1 గిగావాట్‌ సామర్థ్యం గల డేటా పార్క్‌ ఏర్పాటు చేయనుంది. రూ.9 వేల కోట్ల పెట్టుబడులకు జెసీకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఒప్పందం. పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. ఏజీపీ గ్రూప్‌ మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం. 1 గిగావాట్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న ఏజీపీ గ్రూప్‌.
 
రూ.3,500 కోట్ల పెట్టుబడులకు బయోలాజికల్‌-ఈ సంస్థ ఒప్పందం. పరిశోధన, అభివృద్ధి, తయారీల పెట్టుబడులు పెట్టనున్న బయోలాజికల్‌- ఈ సంస్థ. రూ.2 వేల కోట్ల పెట్టుబడులకు ఫెర్టిస్‌ ఇండియా సంస్థ ఒప్పందం. ఫుడ్‌, అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఫెర్టిస్‌ ఇండియా ఒప్పందం. రూ.3వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫుడ్‌ లింక్‌ ఎఫ్‌ అండ్‌బీ హోల్డింగ్స్‌. డ్రీమ్‌వాలీ గోల్ఫ్‌ అండ్‌ రిసార్ట్స్‌ను రూ. వెయ్యికోట్లతో నిర్మించనున్న ఫుడ్‌ లింక్‌. ఇలా అనేక ప్రముఖ కంపెనీలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తూ, ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.