తెలంగాణాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే...
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ తేదీలను వెల్లడించారు. వచ్చే యేడాదిమార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ మేరకు టెన్త్ పరీక్షల నిర్వహణ బోర్డు ఎస్ఎస్సీ మంగళవారం వెల్లడించింది.
మార్చి 14వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 18వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2వ తేదీన ఫిజిక్స్, 7వ తేదీన బయాలజీ, 13వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, ఏప్రిల్ 16వ తేదీన ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్షను నిర్వహిస్తారు.