మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (11:53 IST)

జూబ్లీహిల్స్ ఏరియాలో ఇల్లును కొనుగోలు చేసిన బాలయ్య

నందమూరి నటసింహం బాలయ్యబాబు ఓ ఇంటిని కొనుగోలు చేశారు. రూ.15 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో సినిమారంగంలో తన కలెక్షన్లతో బాక్సాఫీస్ షేక్ చేసే బాలయ్య.. ఇప్పుడు రియల్ఎస్టేట్ రంగంలోనూ తన కొనుగోలుతో రికార్డ్ స్థాయి ధర పలకించారని చెప్పాలి ఫిబ్రవరి 11,2021న ఈ డీల్ పూర్తి చేసారు బాలయ్య. 
 
నడింపల్లి సత్యశ్రావణి నుంచి ఆయన ఈ ఇల్లు కొనుగోలు చేసినట్లు జాప్‌కీ డాట్ కామ్( Zapkey.com) వెబ్‌సైట్ చెప్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో రెండు అంతస్థులు కలిగిన ఈ భవంతి మొత్తం 9395 చదరపు అడుగుల్లో బిల్టప్ ఏరియా ఉంది. 
 
ఈ భవంతిని బాలయ్యబాబు దంపతులు ఇద్దరి పేరిట జాయింట్‌గా కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ని బట్టి తెలుస్తోంది. మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.82.5లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.7.5లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.