మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (07:32 IST)

గెస్ట్ హౌస్‌లో మహిళపై లైంగికదాడికి పాల్పడిన కానిస్టేబుల్!

మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మీరట్‌లో ఓ మహిళపై పోలీస్ కానిస్టేబుల్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ లైంగిక దాడి ఓ గెస్ట్ ‌హౌస్‌లో జరిగింది. ఆ సమయంలో ఆ గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు కూడా అక్కడే ఉండటం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని మీరట్‌ జిల్లా నౌచందీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గెస్ట్‌హౌస్‌కు తనకు తెలిసిన వ్యక్తితో మహిళ శనివారం గెస్ట్‌హౌస్‌కు వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
నేరం జరిగిన సమయంలో గెస్ట్‌హౌస్‌ యజమాని కుమారుడు అక్కడే ఉన్నట్టు సమాచారం. పోలీస్‌ అరాచకంపై తాను ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. పైగా, గెస్ట్‌హౌస్‌ యజమాని కుమారుడు పోలీస్‌ కానిస్టేబుల్‌కు తెలుసని, మహిళ అక్కడికి రాగా పోలీస్‌కు అతడే సమాచారం ఇచ్చాడని, ఆపై అతిథి గృహంపై దాడి డ్రామా నడిపించారని బాధితురాలు పేర్కొన్నారు. 
 
మహిళను ఆమెతో పాటు వచ్చిన వ్యక్తిని బెదిరించిన కానిస్టేబుల్‌ ఆపై మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని స్థానిక వార్తా పత్రికలు పేర్కొంటున్నాయి. అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆమె వద్ద నుంచి నగదును కూడా పోలీస్‌ కానిస్టేబుల్‌ లాక్కున్నాడని తెలిపింది. 
 
బాధితురాలు నౌచంది పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఆమెను అక్కడి నుంచి పంపించివేశారు. నిందితుడు ఇప్పటికీ అదే పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడని తెలిసింది. తమకు అతడిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని నౌచంది పీఎస్‌ అధికారి ప్రేమ్‌చంద్‌ శర్మ పేర్కొన్నారు.