1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:22 IST)

బెడ్రూంలో ప్రియుడితో కోడలిని చూసిన అత్త, భయంతో ఆ పని చేసిన కోడలు?

భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఇద్దరు పిల్లలు. అత్త, మామలే కోడలిని చూసుకునేవారు. కానీ ఒంటరితనం మాత్రం ఆమెకు నచ్చలేదు. తన ఇంటికి దగ్గరలో ఉన్న యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అత్త ఎన్నోసార్లు మందలించింది. అయితే ఒకరోజు అత్తను దారుణంగా చంపి పరారైంది కోడలు.
 
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన యోగిత అనే మహిళకు రెండేళ్ళ క్రితం భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. పుట్టింటికి వెళ్ళకుండా మెట్టినింట్లోనే ఉంటోంది యోగిత. మామ, అత్త సొంత కూతురిలా చూసుకుంటూ ఉండటంతో ఆమె ఇక్కడే పిల్లలతో ఉండిపోయింది.
 
అయితే ఇంటిలో పనిచేయకపోవడం.. ఖాళీగా కూర్చుని ఉండేది యోగిత. అది ఏమాత్రం అత్తకు ఇష్టం ఉండేది కాదు. చాలాసార్లు ఇద్దరి మధ్యా గొడవ జరిగింది.. ఆ గొడవను మామ సద్దుమణిగించేవాడు. ఒంటరిగా మహిళ కనబడితే చాలు కామాంధుల కన్ను పడటం సహజమే. అలా యూసఫ్ అనే యువకుడు యోగితపై కన్నేసాడు.
 
మెల్లగా ఆమెను మాటల్లో దింపి ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. అసలే భర్త లేకపోవడంతో అతడి మాటలకు పడిపోయింది. అతడితో శారీరకంగా దగ్గరైంది. అలా రెండునెలల పాటు సాగింది. తను ఉంటున్న ఇంటికి మిద్దెపైనే యోగిత రాసలీలల్లో మునిగితేలేది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడేది. 
 
అయితే అత్తకు దొరికిపోయింది. మందలించింది అత్త. ఇంటి పనులు చేస్తుంటే అలాంటి ఆలోచనలు రావు. ఖాళీగా కూర్చుంటేనే రకరకాల ఆలోచనలు వస్తాయంటూ చీవాట్లు పెట్టింది. దీంతో కోపంతో రగిలిపోయిన యోగిత ఇంట్లోని రోకలిబండతో ఆమె తలపై గట్టిగా కొట్టింది.
 
66 యేళ్ళ వయస్సు కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. భయంతో యోగిత ఇంటి పక్కన గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది. అసలు యోగిత ఎందుకు పారిపోతోందో తెలియక చుట్టుప్రక్కల వారు ఆలోచనలో పడ్డారు. ఇంట్లోకి వచ్చేచూసేసరికి రక్తపుమడుగులో యోగిత అత్త పడిపోయి కనిపించింది.
 
దీంతో ఆమెను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారేమోనన్న భయంతో పక్కింటి బాత్రూంలోకి దూరి ఫినాయిల్ తాగేసింది. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉండటంతో పోలీసులు అరెస్టు చేశారు.