1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. MLA Balakrishna to participate in silent protest today

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష

MLA Balakrishna
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మౌనదీక్షకు దిగారు. హిందూపురం ప్రధాన కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించాలని కోరుతూ ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష పార్టీలకు అతీతంగా జరుగుతుంది. 
 
ఈ దీక్ష తర్వాత ఎమ్మెల్యే హోదాలో ఆయన అన్ని పార్టీల నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా భేటీ అవుతారు. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుని ప్రభుత్వానికి విన్నవించనున్నారు. 
 
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లా ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెల్సిందే. దీంతో కొత్త జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక వస్తుంది. పైగా, తమ ప్రాంతాలను కేంద్రంగా చేసి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 
 
ఇందులోభాగంగా, హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే, హిందూపూర్‌లోని అధికార వైకాపా కౌన్సిలర్లు కూడా ఒకతాటిపైకి వచ్చి హిందూపూర్‌ను జిల్లా కేంద్రంగా చేయడానికి తమ మద్దతును ప్రకటించారు. మరోవైపు పెనుగొండ ప్రజలు కూడా తమ ప్రాంతాన్ని జిల్లా ప్రధాన కార్యాలయం చేయాలని కోరుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
బండిగారూ... హైదరాబాద్‌లో కాదు ఢిల్లీలో మిలియన్ మార్చ్ చేయండి..