శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (16:06 IST)

నారా లోకేష్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. బడ్జెట్ సమావేశాలపై ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేసారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనగా బయలుదేరి సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీసిందంటూ టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
గత బడ్జెట్ లో రూ.93వేల కోట్లను బడ్జెట్ అనుమతి లేకుండా వైకాపా ప్రభుత్వం ఖర్చుచేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడిందంటూ విమర్శలు గుప్పించారు. 
 
ఈ సందర్భంగా టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. 
 
బడ్జెట్ నిధులు తాడేపల్లి ప్యాలెస్‌కు మల్లుతున్నాయంటూ బుచ్చయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ బాండ్లన్నీ వైకాపా ప్రభుత్వం అమ్మకానికి పెట్టేసిందని.. ఇక రాష్ట్రంలో ఏం మిగులుతుందని ఆయన అన్నారు.