రాజంపేట జిల్లా కేంద్రంగా వద్దంటూ వైసీపీ నాయకులే ఎదురుతిరిగారు... ఐతే...
జిల్లాల విభజన వ్యవహారం అధికార పార్టీ వైసిపీలోనే చిచ్చు పెడుతున్నట్లు కనిపిస్తోంది. కడప జిల్లా రాజంపేటను రాజంపేట జిల్లాగా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో విభజన చేయడాన్ని అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దీనితో వైసీపీ నేతలు దీనిపై రెండు వర్గాలుగా చీలిపోయి పోరాటం చేస్తుండటం గమనార్హం. ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. మరి ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఈ పోరాటాన్ని టీడీపి నేత చంగలరాయుడు చేతుల్లో పెట్టి వైసిపి నాయకులు సైడ్ అయ్యారు. మరి వెనుకనుంచి మద్దతు పలుకుతున్నారేమో?