శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (20:16 IST)

మొగుడుపెళ్ళాలు కాపురం చేసుకోకపోయినా నేనే కారణమా? చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సర్పంచ్‌లో అవగాహ సదస్సు జరిగింది. ఇందులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ రెడ్డి సెటైర్లు వేశారు. జగన్ రెడ్డి ఇంట్లో భార్యాభర్తలు కాపురం చేసుకోకపోయినా నేనే కారణమంటారు అని అన్నారు. మనషులు మాట్లాడేందుకు కూడా హద్దులు ఉంటాయని, ఓ పద్దతి ఉంటుందన్నారు. 
 
సాక్షాత్ బాబాయి.. చంపితే రెండు లాభాలు. అందుకోసం ఎంతో అందమైన నాటకం రచించారు. ఇలాంటి ఐడియా ఎవరికీ రాదు. స్క్రిప్టు అద్భుతంగా రాశారు. అడ్డుగా ఉన్న వివేకాను అడ్డుతొలగించాలని. ఎందుకంటే ఎంపీ సీటు విజయమ్మకో, షర్మిలకో ఇవ్వాలని వివేకా అన్నారని వారి కుటుంబ సభ్యులో చెబుతున్నారు. 
 
అసెంబ్లీలో సీఎం జగన్ తనకు వారిద్దరూ రెండు కళ్లు అని చెప్పారు. ఒక కన్ను మా బాబాయి. మరో కన్ను మా తమ్ముడు (అవినాశ్ రెడ్డి) అని చెప్పారు. ఈ మాట చెప్పిన పెద్ద మనిషి సానుభూతి కోసం ప్రయత్నించాడు. హత్యను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నాపై వేశాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకున్నాడు. 
 
ఈ విధంగా చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అదీ ఆయన ధైర్యం. అదీ ఆయన నైజం. అదీ ఆయన ఆ కుటుంబ చరిత్ర. కోడికత్తి సరే చిన్న నాటకం. బాబాయిది పెద్ద నాటకం. ఏం జరిగినా అందుకు నేనే కారణం అంటున్నారు. వాళ్ల ఇళ్లలో భార్యాభర్తా కాపురం చేసుకోకపోయినా నేనే కారణమంటారు అంటూ చంద్రబాబు సెటైర్ వేశారు.  అమరావతిపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఇది ఐదు కోట్ల ప్రజల విజయమన్నారు.