సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (17:28 IST)

కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ పొలిట్‌బ్యూరో... ఏంటది?

ఈ నెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ సమావేశాలకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం సమావేశమైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకారాదని నిర్ణయించారు. 
 
అయితే, ఈ విషయంపై పొలిట్‌బ్యూరో నిర్ణయమే అంతిమం కాకుండా టీడీపీ శాసనసభాపక్ష భేటీలోనూ విపులంగా చర్చించి ఆపై ఒక నిర్ణయానికి రావాలని తీర్మానించారు. దీంతో త్వరోలనే తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం భేటీ సమావేశంకానుంది. ఈ భేటీలో పార్టీ తరపున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఇందులో అసెంబ్లీ సమావేశాలకు కావాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు.