గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (06:50 IST)

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం డుమ్మా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి నెలలో జరుగనున్నాయి. ఈ సమావేశాలకు డుమ్మా కొట్టాలని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టుగా ఉంది. ఇదే విషయాన్ని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. 
 
మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలా? వద్దా? అనే అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా, గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా బాధపడి, ఇకపై ఈ సభలో ముఖ్యమంత్రి హోదాలోనే అడుగుపెడతానంటూ శపథం చేశారు. ఆ తర్వాత ఆయ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు మార్చిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై గురువారం పార్టీలోని ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నందుకు సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. 
 
అయితే, సమావేశాలకు హాజరైనప్పటికీ అధికారపక్షం సమయం ఇవ్వదని, అందువల్ల వెళ్ళడం అనససరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీంతో టీడీపీ శాసనసభాపక్షంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశంలో చంద్రబాబు నిర్ణయించినట్టు తెలింది.