గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-02-2022 శుక్రవారం రాశిఫలితాలు - సత్యనారాయణస్వామిని ఆరాధించిన శుభం...

మేషం :- ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. షాపుల స్థల మార్పుతో మరింత అభివృద్ధి సాధ్యం. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదరుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయుట మంచిది.
 
వృషభం :- అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. రుణాలు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. పట్టుదలతో యత్నాలు సాగించండి, సత్ఫలితాలు లభిస్తాయి. దూర ప్రయాణాల్లో వస్తువులపట్ల మెళుకువ అవసరం. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.
 
మిథునం :- కంది, మిర్చి, నూనె, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసివచ్చేకాలం. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సరదాలు కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృత్తిపరమైన చికాకులు ఎదురవుతాయి. ముఖ్యుల రాకపోకలు అధికం అవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
కర్కాటకం :- ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. బంధువులను కలుసుకుంటారు.
 
సింహం :- రాజకీయనాయకులకు దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. అనుకోని ఖర్చులు ఎదురైనా ధనానికి ఇబ్బందులుండవు. 
 
కన్య :- స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చేతివృత్తుల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
 
తుల :- వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఆడిటర్లకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకండి. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. వాహన యోగం కలదు. హామీలు ఉండుట మంచిది కాదు అని గమనించండి.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు అధికమిస్తాయి. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. స్థిరచరాస్తుల కొనుగోలు విషయమైన ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. దైవ, సేవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు :- గృహోపకరణాలు అమర్చుకుంటారు. స్నేహితులు మీ జీవితాన్నికి మూల స్తంభాలుగా మారతారు. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించడం క్షేమదాయకంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఎదురయ్యే ప్రతి విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి.
 
మకరం :- ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. కరనమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
కుంభం :- ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడతారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశతప్పదు.
 
మీనం :- శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు.