శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-02-2022 మంగళవారం రాశిఫలితాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...

మేషం :- రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఒక్కొసారి ఎదుటివారి ధోరణి మీకెంతో ఆందోళన, నిరుత్సాహం కలిగిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి.
 
వృషభం :- విద్యుత్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. కోర్టులో దావా వేసే విషయంలో పునరాలోచన మంచిది. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేధాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. వృత్తిపరంగా ఎదురైన సమస్యలు క్రమేణా తొలగిపోగలవు. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి.
 
మిథునం :- దైవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. ఖర్చులు మీ అంచనాలను మించటంతో రుణాలు, చేబదుళ్ళు వంటివి తప్పవు. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థకు గురవుతారు.
 
కర్కాటకం :- మీ లోటు పాట్లు, తప్పిదాలను సరిదిద్దు కోవటానికి యత్నించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన చాలా అవసరం. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. 
 
సింహం :- హోదాలో ఉన్న అధికారులకు ఆకస్మిక స్థానచలనం తప్పదు. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. స్త్రీలకు స్వీయ ఆర్జన, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
కన్య :- స్త్రీలకు షాపింగ్ కోసం ధనం వెచ్చిస్తారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయక ఎదుటివారి ఆంతర్యం గ్రహించేందుకు యత్నించండి. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. మీ మాట నెగ్గకపోయినా మీ గౌరవానికి భంగం కలుగదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థినుల తొందరపాటుతనం వల్ల చికాకులు తప్పవు.
 
తుల :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఖర్చులు అదుపుచేయాలన్న మీ ఆశయం నెరవేరదు. శత్రువులపై విజయం సాధిస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం :- కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహరాలతో తీరిక ఉండదు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ధనం ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు.
 
మకరం :- ఆర్థిక విషయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ప్రైవేటు సంస్థలలో మదుపు చేయటం మంచిది కాదని గమనించండి. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులు తప్పవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
 
కుంభం :- ఉద్యోగ, వ్యాపారాలలో అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనల్లో పాత మిత్రులను కలుసుకుంటారు. బ్యాంకు పనులు చురుకుగా సాగుతాయి. ఇంటర్వ్యూలలో జయం మిమ్మల్ని వరిస్తుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. బంధువులతో పట్టింపులు తలెత్తుతాయి.
 
మీనం :- పుణ్యక్షేత్ర సందర్శనల్లో పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచడం మంచిది. వైజ్ఞానిక, శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్వలాభం కంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.