సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-02-2022 ఆదివారం రాశిఫలితాలు - రాజరాజేశ్వరి అష్టకం చదివినా లేక విన్నా శుభం..

మేషం :- రాజకీయనాయకులు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది.
 
వృషభం :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. యాదృచ్చికంగా ఒక పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మిథునం :- ఆర్థిక ఇబ్బందులు అంటూ ఏమీ ఉండవు. టి.వి.రేడియో, సాంకేతిక రంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది. కొంతమంది మీతో స్నేహం నటిస్తూనే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. రావలసిన ధనం చేతికందడంతో మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం :- కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. డాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.
 
సింహం :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రముఖుల కలయితో పనులు సానుకూలమవుతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు.
 
కన్య :- దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. మిత్రుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
 
తుల :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. మీమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలను ఎదుర్కుంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, ఉద్వోగాలయందు ఆశించిన ఆదాయం లభిస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభించగలదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఏజెంట్లు, బ్రోకర్లు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఆకస్మిక ప్రయాణాలలో చికాకులు తప్పవు. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
మకరం :- ఆదాయ వ్యయాలు సంతృప్తిగా ఉంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.
 
కుంభం :- వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానంతో సరదాగా గడుపుతారు. మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
 
మీనం :- ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేయడం మంచిది కాదు అని గమనించండి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.