శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-02-2022 శుక్రవారం రాశిఫలితాలు - కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం

మేషం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉపాధ్యాయులకు మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. 
 
వృషభం :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో అందరినీ ఆకర్షించగలుగుతారు. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశమవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు.
 
మిథునం :- ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. విదేశీ వస్తువులు పట్ల ఆసక్తి పెరుగుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యక్తులకు కలుసుకుంటారు. బ్యాంకింగ్ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఖర్చులు అదుపు చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు.
 
కర్కాటకం :- దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కళ, క్రీడా పోటీల్లో రాణిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి కాగలవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
సింహం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి సఫలీకృతులవుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వూలలో మెళుకువ అవసరం. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కన్య :- ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు వైద్య సేవలు అవసరమవుతాయి. మీ శ్రీమతి వైఖరి చికాకు పరుస్తుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
 
తుల :- ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. సోదరి, సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ముందుగా ఊహించిన ఖర్చులు కావటంతో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- మీ సంతానం విద్యా విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. కుటుంబీకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఏకాగ్రత వహించలేరు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. టీ.వీ కార్యక్రమాల్లో స్త్రీలు రాణిస్తారు.
 
ధనస్సు :- ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. మీ సతానం కోసం ధనం భాగుగా ఖర్చు చేస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మకరం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులు మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. బంధువు రాక వల్ల ఊహించని ఖర్చులు అధికమవుతాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కుంభం :- ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారి నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
 
మీనం :- ఆదాయానికి మంచి ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులకు ఆందోళన, నిరుత్సాహం వంటివి తప్పవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.