శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-02-2022 సోమవారం రాశిఫలితాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం...

మేషం :- మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దైవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించటం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. 
 
వృషభం :- వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు.
 
మిథునం :- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దేవాలయ విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడంవల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కర్కాటకం :- కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు వంటివి అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
సింహం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ఏ వ్యక్తి అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. రాబడికిమించిన ఖర్చులెదురైనా ఇబ్బందులుండవు. ఆలయాలను సందర్శిస్తారు.
 
కన్య :- ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో వాయిదాపడుతున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ఆలోచన విరమించుకోవటం శ్రేయస్కరం. కొంతమంది మీ నుంచి సమాచార సేకరణకు యత్నిస్తారు. గృహ నిర్మాణాలు, మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు.
 
తుల :- దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాల్లో చికాకులు తప్పవు. స్త్రీలకు పనిభారం అధికం కావడంతో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి వస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థికలావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. నిరుద్యోగులకు లభించిన అవకాశం ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. స్టాక్ మార్కెట్ రంగాలవారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. లక్షసాధనలో గత అనుభవాలు ఉపకరిస్తాయి.
 
ధనస్సు :- ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. సొంత వ్యాపారాలే మీకు అన్ని విధాలా శ్రేయస్కరం. మీ అభిరుచులకు తగినవిధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
మకరం :- ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. మీ వ్యవహార దక్షత, పనితీరులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రుణ యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి.
 
కుంభం :- ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు, విస్తరిస్తాయి. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి.
 
మీనం :- ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్ళు, మొహమాటాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రముఖుల ప్రమేయంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఎంత శ్రమించినా ఆశించిన ఫలితం ఉండదు.