ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Modified: బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (09:06 IST)

9-02-2022 రాశి ఫలితాలు.... ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం, వాహన యోగం

మేషం :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృత్తి, వ్యాపారులకు అన్ని విధాలా కలసిరాగలదు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనలు అధికం.

 
వృషభం :- గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి.

 
మిథునం :- మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు, పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిస్తుంది. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి.

 
కర్కాటకం :- శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లు, నర్సులకు ఏకాగ్రత అవసరం. ఆలయ సందర్శనాలలో చురుకుటా పాల్గొంటారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కోర్టు పనులు వాయిదాపడతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

 
సింహం :- ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. విద్యార్థులు ధ్యేయం పట్ల ఏకాగ్రత వహిస్తారు. పొదుపు పథకాలు, నూతన పెట్టుబడులకు ఇది అనువైన సమయంకాదు. పచారీ, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.

 
కన్య :- ఆడిటర్లకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. ఆస్తి పంపకాలకు సంబంధించి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.

 
తుల :- ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలిస్తాయి. ఫైనాన్సు, చిటవ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. సంఘంలోను, కుటుంబంలోను మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. మిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

 
వృశ్చికం :- ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పోస్టల్, ఎల్‌ఐసి ఏజెంట్లకు ఒత్తిడి, తిప్పట తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. రావలసిన ధనం అందటంతో కొంత మొత్తమైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది.

 
ధనస్సు :- ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు తమ లక్ష్యసాధన పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తారు. మీ గురించి ఇతరులు చాటుగా చేసిన విమర్శలు మనస్తాపం కలిగిస్తాయి. సన్నిహితులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. బంధువర్గాల్లో మీరంటే అభిమానం ఏర్పడుతుంది.

 
మకరం :- విద్యార్థుల్లో ఏకాగ్రత లోపం, మందకొడితనం వల్ల చికాకులు తప్పవు. ప్రేమికులకు పెద్దల నుంచి అభ్యంతరా లెదురవుతాయి. ఉద్యోగస్తులు తోటివారితో యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహరాలు, భూవివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం ఉండదు.

 
కుంభం :- సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.

 
మీనం :- బంధువులు, ఆత్మీయుల రాకపోకలు అధికమవుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మనోధైర్యం, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పారిశ్రామిక రంగాల వారీకి కార్మికులతో సమస్యలను ఎదుర్కొంటారు. ప్లీడర్లు, ప్రముఖులతో కీలకమైన సంప్రదింపులు జరుపుతారు.