శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-02-2022 సోమవారం రాశిఫలితాలు - పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధించిన...

మేషం :- కొంతమంది మీపై అభాండాలు వేసే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. తోటల రంగాలలో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. మీ సంతానం ప్రేమ వ్యవహారాలలో పునరాలోచన అవసరం. క్రీడ, కళా, రచన, పత్రికా రంగాల్లో వారికి ఒత్తిడి చికాకు తప్పదు. రిప్రజెంటేటివ్‌లకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.
 
వృషభం :- రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కార్మిక బకాయిలు, పి.ఎఫ్. బకాయిలు ఒక కొలిక్కి రాగలవు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. విద్యార్థులకు చదువులపట్ల ఏకాగ్రత చాలా అవసరం.
 
మిథునం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. అక్రమ సంపాదనపై దృష్టి పెట్టకపోవడం మంచిది. సినిమా, కళా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికం కాగలవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
కర్కాటకం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మీ సంతానంకోసం ఫీజులు చెల్లిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
సింహం :- కంపెనీలు, ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు వాయిదాపడతాయి. పరిశోధనల విషయాలపై దృష్టి సారిస్తారు. చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. స్త్రీలకు టీ.వీ చానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది.
 
కన్య :- ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. బంధువుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం విరమించుకోవటం మంచిది.
 
తుల :- స్త్రీలకు షాపింగ్ లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది. ధనం ఎంతవస్తున్న ఏమాత్రం నిలువ చేయలేక పోవుట వలన ఆందోళనకు గురిఅవుతారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- ఆదాయానికి తగినట్లుగానే వ్యయం చేస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఎప్పటి నుండో ఆగిపోయిన మొండి పనులు పునఃప్రారంభం అవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తలెత్తగలవు.
 
ధనస్సు :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఏకాగ్రత చాలా అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కొంటారు. తరచు సభసమావేశాలలో పాల్గొంటారు.
 
మకరం :- గృహంలో ప్రశాంతత మీచేతుల్లోనే ఉందని గమనించండి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వైద్యులు ఆపరేషన్లను మిజయవంతంగా పూర్తిచేస్తారు.
 
కుంభం :- రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు అధికమవుతాయి. కష్టసమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్థిర, చరాస్తుల విషయంలో తొందరపాటుతనం మంచిది కాదని గ్రహించండి.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. బంధు మిత్రుల నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి.