గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-02-2022 బుధవారం రాశిఫలితాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ...

మేషం :- బంధువుల రాకపోకలు సంతృప్తినిస్తాయి. అనుకోని కారణాల వల్ల ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఏ విషయంలోను మొహమాటాలకు పోకుండా మీ నిర్ణయం ఖచ్చితంగా తెలియజేయటం శ్రేయస్కరం. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
 
వృషభం :- దైనందిన కార్యక్రమాలు అన్నీ సకాలంలో పూర్తవుతాయి. భూ వివాదాలు, ఆస్తి వ్యవహరాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
మిథునం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. రావలసిన ధనం కొంత మొత్తమైనా చేతికందుతుంది. స్త్రీల సంకల్పం నెరవేరే సమయం ఆసన్నమైంది. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు. ద్విచక్రవాహానంపై దూరప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి.
 
కర్కాటకం :- దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ట్రాన్సుపోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలో వారికి మిశ్రమఫలితం.
 
సింహం :- మీ సంతానం ప్రేమ వ్యవహారాలలో పునరాలోచన అవసరం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి. స్త్రీలకు కళ్ళు, తలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. మీ బాధ్యతాయుత ప్రవర్తన అధికారులను ఆకట్టుకుంటుంది.
 
కన్య :- వృద్ధాప్యంలో ఉన్న వారికి శారీరిక బాధలు సంభవిస్తాయి. బంధువుల రాక ఇంబ్బదులకు గురిచేస్తుంది. మీ పొదుపరితనం కుటుంబ సభ్యులకు చికాకు కలిగిస్తుంది. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో నిలదొక్కుకోవటానికి ఎంతగానో శ్రమించవలసి ఉంటుంది.
 
తుల :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు బాధ్యతలను నిర్వర్తించడంలో మెలకువ వహించండి. మీ శ్రీమతి వితండవాదం, సంతానం మొండితనం చికాకు కలిగిస్తాయి. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకు లెదుర్కోవలసివస్తుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి.
 
వృశ్చికం :- స్త్రీలకు టి.వి. ఛానెళ్ళ కార్యక్రమాల సమాచారం అందుతుంది. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా మెలగాలి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
 
ధనస్సు :- ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ సంకల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. ప్రైవేటు సంస్థలలోని వారు మరో ఉద్యోగంలో చేరే విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీల ప్రజ్ఞాపాఠవాలకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
 
మకరం :- ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల రాకతో గృహం కళకళలాడుతుంది. నూతన దంపతులకు సంతానం కలుగు సూచనలు కలవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
కుంభం :- వ్యాపారాల్లో మొహమాటాలు, భేషజాలకు పోవడం మంచిది కాదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. గృహం కొనుగోలు చేయుప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.
 
మీనం :- రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాలవారు ఆచితూచి వ్యవహరించాలి. ఆలయ సందర్శనాలలో చికాకులు తప్పవు. క్రీడ, కళారంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని విషయాల్లో ఇతరుల సహాయం అర్థించటానికి మొహమ్మాటపడతారు. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు.