గురువారం, 4 డిశెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 డిశెంబరు 2025 (12:28 IST)

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

Lord Shiva
భౌమ అంటే కుజుడు, మంగళవారాలు త్రయోదశి తిథిలో వచ్చినప్పుడు దానిని భౌమ ప్రదోషం అంటారు. ఈ రోజు క్రియ, ధైర్యం, విశ్రాంతితో ముడిపడి వుంటుంది. ఈ రోజున శివునిని పూజించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. శివపూజతో మానసిక ప్రశాంతత, శారీరక బలం, శ్రేయస్సు కోసం భౌమ ప్రదోష పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రదోష సంధ్యా కాల సమయంలో శివపూజ చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు చేకూరుతాయి. 
 
ఇంకా ప్రతికూల కర్మలను తొలగిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా అనారోగ్య సంబంధాలను దూరం చేస్తుంది. ఈ రోజంతా ఉపవాసం వుండటం.. ప్రదోష వేళలో నందీశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా కర్మ ఫలితాలను దూరం చేసుకోవచ్చు. అప్పులు లేదా ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కోసం భౌమ ప్రదోష వ్రతం ఆచరించడం మంచిది. శివునికి నెయ్యి దీపం వెలిగించాలి. 
 
108 సార్లు బిల్వార్చన చేయడం మంచిది.  
 
అలాగే ఉపవాసం వున్నవారు ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. సాయంత్రం పూజ ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు.