శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-02-2022 ఆదివారం రాశిఫలితాలు - లలిత సహస్రనామ పారాయణం చేయడంవల్ల..?

లలిత సహస్రనామ పారాయణం చేయడంవల్ల కానీ వినడం వల్ల శుభం కలుగుతుంది.
 
మేషం:- గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. మీ మనస్సుకు నచ్చని విషయాలను చూసీ చూడనట్టుగా వ్యవహరించవలసి వస్తుంది. కుటుంబీకుల మధ్య అవగాహన అంతగా ఉండదు. రాజకీయ నాయకులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. విలాస వస్తువుల కొనుగోలుకు ధనం బాగాన్వయం చేస్తారు.
 
వృషభం :- వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. చేపట్టిన పనులలో తరుచు ఆటంకాలు ఎదురవుతాయి. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
మిధునం: - రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద పూర్తి చేస్తారు. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఏకాగ్రత వహించలేరు. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. విందుల్లో పరిమితి పాటించండి. అనుకోని ఖర్చులు ఎదురైనా ధనానికి ఇబ్బందు లుండవు.
 
కర్కాటకం:- సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, తగిన అవకాశం కలిసివస్తుంది. నిరుద్యోగులు ఆశాదృక్పథంతో యత్నాలు సాగించాలి. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది.
 
సింహం:- వృత్తి వ్యాపారులకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. మిత్రుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కన్య:- ఆస్తి వ్యవహారాలలో పెద్దల నిర్ణయం నిరుత్సాహపరుతుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు పురోభివృద్ధి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు.
 
తుల: - ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీల అనాలోచిత నిర్ణయాలు, ఆగ్రహావేశాల వల్ల కుటుంబములో చికాకులు, కలహాలు తలెత్తుతాయి. షాపులలో పనిచేసే వారిలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
వృశ్చికం: - ఉద్యోగ, వివాహ యత్నాల్లో సఫలీకృతులవుతారు. తరచు సభా సమావేశాలలో పాల్గొంటారు. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, హోటల్, తిను బండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటారు. 
 
ధనస్సు: - వాణిజ్య ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళుకువ వహించండి. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యము కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. 
 
మకరం:- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ వాతావరణం అధికు కావటంతో ఆందోళన చెందుతారు. ప్రతి విషయలోను ఓర్పు, సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఖర్చులు, ఆదాయం సంతృప్తికరంగా ఉంటాయి. 
 
కుంభం: - రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. మీ ఆంతరంగిక సమస్యలకు పరిష్కార మార్గం కానరాగలదు. 
 
మీనం:- ఆలస్యంగా అయినా పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. పట్టు విడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి.