శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-02-2022 శుక్రవారం రాశిఫలితాలు - ఇష్టకామేశ్వరిదేవిని పూజించడం...

మేషం :- దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు వంటివి తప్పవు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి.
 
వృషభం :- నిరుద్యోగులు ఉద్యోగయత్నాలలో విజయం సాధిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదని గమనించండి.
 
మిథునం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సోదరి, సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
కర్కాటకం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
సింహం :- ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పారిశ్రామిక రంగంలో వారికి కార్మికులతో చికాకులు తప్పవు. బంధువుల రాక, ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఉత్సాహం, ఏకాగ్రత ఎంతో అవసరం.
 
కన్య :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అధిక ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.
 
తుల :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ట్రాన్సుపోర్టు, ఆటోమొబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొంతమంది మిమ్ములను తక్కువ చేసి వ్యాఖ్యానించటం వల్ల మనస్తాపానికి గురికావలసివస్తుంది.
 
వృశ్చికం :- బ్యాంకు వ్యవహారాలు అనుకూలించకపోవుట వల్ల ఆందోళన చెందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలు ప్రతి విషయంలో అతిగా వ్యవహరించడం మంచిదికాదని గ్రహించండి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విద్యార్థులు సన్నిహితుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు.
 
ధనస్సు :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. కాంట్రాక్టరకు రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
మకరం :- ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.
 
కుంభం :- కొబ్బరి, పండ్ల, పూల, వ్యాపారులకు కలిసివస్తుంది. పాత రుణాలను తీరుస్తారు. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి వంటివి సంభవిస్తాయి. విద్యార్థినులకు టెక్నికల్, సైన్సు, గణిత కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయటం వల్ల సత్ఫలితాలు పొందుతారు.
 
మీనం :- గృహమునకు కావలసిన విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు అలౌకిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.