శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-02-2022 శనివారం రాశిఫలితాలు - సత్యనారాయణస్వామిని ఆరాధించిన శుభం...

మేషం :- స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. దేనికీ కలసిరాని మీ కళత్ర వైఖరి నిరుత్సాహపరుస్తుంది. మీ అంతరంగిక విషయాలు ఇతరులకు చెప్పడం మంచిది కాదని గ్రహించండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
వృషభం :- అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థకు గురవుతారు. ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అసవరం. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు చీటికిమాటికి అసహనం, నిరుత్సాహం వంటి చికాకులు తప్పవు. క్రయ విక్రయాలు ఆశించినంత లాభసాటిగా ఉండవు.
 
మిథునం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకపడటం మంచిది కాదని గ్రహించండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ప్రయాణాలలోనూ, బ్యాంక్ వ్యవహారాలలోను ఇబ్బందులను ఎదుర్కొంటారు. రవాణా రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
సింహం :- ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి స్థిరచిత్తంతో పనిచేయవలసి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారముంది మెళకువ వహించండి. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
కన్య :- దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యాసంస్థల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
తుల :- అడిటర్లకు నెమ్మదిగా మార్పు కానవస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. పెద్దల ఆరోగ్యం గరించి ఆందోళన చెందుతారు. రిప్రజేంటేటివ్‌లు మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లు పనివారివల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి అచ్చు తప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. సోదరీ, సోదరుల మధ్య ఏహ్యభావం కుదరదు.
 
ధనస్సు :- సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ఇతర ఒప్పందాలు వాయిదా పడటం మంచిది. బంధు మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. పెద్దల ఆహార వ్యవహారాల్లో మెలకువ వహించండి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. 
 
మకరం :- దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆలయ సందర్శనాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అసవరం. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. పెద్దలు విందులలో పరిమితి పాటించండి. కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
కుంభం :- ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత, మెళుకువ అవసరం.
 
మీనం :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయు యత్నాలు కలిసివస్తాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. మీ పాత సమస్యలు ఒకంతట తేలకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు.