మంగళవారం, 14 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:44 IST)

10-02-2022 గురువారం రాశిఫలితాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా..

మేషం :- కుటుంబీకులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి జాయింట్ వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది.
 
వృషభం :- కొబ్బరి, పండ్లు, పూలు, పానియ చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. క్రీడ, కళ, సాంస్మక రంగాల పట్ల ఆశక్తి వహిస్తారు. కుటింబీకులతో అవగాహన లోపిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి. ఎవరికీ హామీలు ఉండం మంచిది కాదు.
 
మిథునం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికంగా సాగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారుల చేత మాటపడాల్సివస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
సింహం :- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్థిరాస్తి, క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెలకువ అవసరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
కన్య :- కాంట్రాక్టర్లకు పనివారి వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదరుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు.
 
తుల :- మీ దైందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ప్రముఖులకు విలువైన కానుకలందించి వారిని ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం :- మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. కిరణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఆశాజనకం. బంధువులకు హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
ధనస్సు :- మీ సంతానం మొండితనం వల్ల అసహనానికి గురవుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి సమస్యలు తలెత్తుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
మకరం :- ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ట్రాన్స్‌పోపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
కుంభం :- బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బంది పడతారు. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కాంట్రాక్టర్లకు పనివారి వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. 
 
మీనం :- నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మీ సంతానం వివాహ విషయానికి సంబంధించిన వివరాలు సేకరిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. మిత్రులను కలుసుకుంటారు.