1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-02-2022 శనివారం రాశిఫలితాలు - ఆంజనేయస్వామిని తమలపాకులతో..

మేషం :- కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపడతారు. పాత రుణాలు తీరుస్తారు. కోర్టు, భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.
 
వృషభం :- భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు స్థానచలన మార్పుతథ్యం. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పెద్దలు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
మిథునం :- గృహోపకరణాలు, విలాస వస్తువులు సమకూర్చుకుంటారు. విద్యార్థినులకు తమ సమర్థతపట్ల నమ్మకం సన్నగిల్లుతుంది. ప్రియతమల ఆరోగ్యం ఆందోన కలిగిస్తుంది. ప్రతి విషయాలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం క్షేమదాయకం. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కర్కాటకం :- ఉన్నతస్థాయి అధికారులకు ఉద్యోగస్తులతో సమస్యలు తలెత్తుతాయి. మీ ప్రత్యర్థుల శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకండి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. నూతన పెట్టుబడులు, రుణ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలుకూడదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
సింహం :- నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. నిరుద్యోగ, వివాహయత్నాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. ప్రముఖుల ప్రమేయంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.
 
కన్య :- కాంట్రాక్టర్లు, బిల్డర్లు నిర్మాణ పనుల్లో సమస్యలెదుర్కుంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకున్న పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి రూపొందించిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి.
 
తుల :- సన్నిహితుల నుంచి ఆహ్వానాలు, ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. స్త్రీలకు దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణం వల్ల ఇబ్బందులు తప్పవు.
 
వృశ్చికం :- ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఓర్పుతో వ్యవహరించడంవల్ల ఒక సమస్య పరిష్కారమవుతుంది. మీ మాటకు వ్యతిరేకత, అపఖ్యాతి వంటి చికాకులు అధికమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి.
 
ధనస్సు :- ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా సమస్యలు తలెత్తుతాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తి పంపకాలకు సంబంధించిన సోదరులతో విభేదిస్తారు. విద్యార్థినులు భయాందోళనలు విడనాది లక్ష్యం పట్ల ఏకాగ్రత వహించటం మంచిది.
 
మకరం :- చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. విలువైన పత్రాలు, వస్తువులు సమయానికి కనిపించకపోయే ఆస్కారం ఉంది. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడి మార్గాలను అన్వేషిస్తారు. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు.
 
కుంభం :- పెద్దల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం వసూలులో ప్రయాస లెదుర్కుంటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వాయిదాపడిన పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. ప్రేమికుల అనాలోచిత నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి.
 
మీనం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు.