మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం గ్రహస్థితి అనుకూలం. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం దుడుకుతనం అదుపు చేయండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. సంస్థలు, నూతన ప్రాజెక్టులకు అనుకూలం. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు. పెద్దల సలహా పాటించండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. వివాహయత్నం ఫలిస్తుంది. తాహతకు మించి హామీలివ్వవద్దు. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల ఏకాగ్రత వహించండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉపాధి పథకం చేపడతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
అన్నివిధాలా కలిసిస్తుంది. చిత్తశుద్ధిని చాటుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. శుక్రవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. సంతానం దూకుడు అదుపు చేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. ధార్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆదివారం నాడు ఏ పనీ చేయబట్టి కాదు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ధనప్రలోభాలకు గురికావద్దు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి గురవుతారు. ఓర్పుతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించి భంగపడతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సోమవారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆరోగ్యం జాగ్రత్త. ఔషధసేవనం, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. సంతానానికి శుభయోగం. ఆహ్వానం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాల, విశాఖ 1, 2, 3 వాదాలు
అనుకూలతలు నెలకొంటాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. కష్టం ఫలిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనులు త్వరితగతిన సాగుతాయి. గురువారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. సంతానం కదలికలను ఓ కంట కనిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుతారు. రాజీమార్గంలో సమస్య పరిష్కారమవుతుంది. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల అలక్ష్యం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొత్త వ్యాపారాలు చేపడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంకల్పసిద్ధితో యత్నం సాగించండి. ఓర్పుతో శ్రమిస్తేనే కార్యం సాధ్యమవుతుంది. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. అవకాశం చేజారినా నిరుత్సాహపడవద్దు. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ప్రైవేట్ సంస్థల్లో పొదుపు తగదు. ఆప్తులతో తరుచు సంభాషిస్తారు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు.ఉమ్మడిగా కంటె సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ధార్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. అనుకున్నది సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. న దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదివారం నాడు పనులు సాగవు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి తాహతు తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకుర ధనప్రలోభం తగదు. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. స్థిమితంగా ఉండానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. బుధవారం నాడు ఆప్రియమైన వార్త వింటారు. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. సంతానానికి ఉద్యోగయోగం. గృహమార్పు కలిసివస్తుంది. నూతన పెట్టుబడులపై దృష్టిపెడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
గ్రహబలం అనుకూలంగా ఉంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితులను సాయం అందిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సోమవారం నాడు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. ఆత్మీయులను సంప్రదిస్తారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ధృఢసంకల్పంతో ముందుకు సాగండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. రావలసినప ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. నగదు జమ చేసేటపుడు జాగ్రత్త. కొత్తవ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహనిర్మాణం చేపడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. రిటైర్డు ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ అందుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉన్నతావకాశం లభిస్తుంది.