గురువారం, 9 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 అక్టోబరు 2025 (13:07 IST)

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

Lord shiva
ప్రదోష వ్రతం విశేషమైనది. శనివారం రోజు వస్తే ఇది ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. 2025 అక్టోబరు 4 శనివారం ప్రదోషవ్రతం వచ్చింది. ఈ రోజున పరమేశ్వరుడికి పూజ చేయండి. శివపూజ పూర్తి చేసిన తర్వాత పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. ప్రదోష వ్రతంతో రుణం నుంచి విముక్తి పొందుతారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఇంకా పూర్తవుతాయి. 
 
అలాగే అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు మనిషి జీవితాన్ని నరకం చేస్తాయి. ఎంత ప్రయత్నం చేసిన రుణబాధలు తీరకపోవడం, అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటే ఒక్కసారి శని ప్రదోష పూజ చేస్తే ఎలాంటి బాధలైనా పోతాయని అంటారు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నరాల సంబంధిత రుగ్మతలు వంటి సమస్యల నుంచి విముక్తి కావాలంటే శని ప్రదోష పూజ చేయాల్సిందే. శని ప్రదోషం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకోవచ్చు. 
 
శనివారం మధ్యాహ్నం త్రయోదశి తిథి ఉన్న రోజున సాయంత్రం 4.30 నుంచి 6 వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో ఆవుపాలతో శివునికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖుపూలు సమర్పించుకుని శివాష్టకం పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సమస్త జాతక దోషాలు పోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
 
ఈ ప్రదోష వ్రతం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. పురాతన కాలంలో ఒక వ్యాపారి తన కుటుంబంతో ఒక నగరంలో నివసించేవాడు. అతనికి పెళ్లై ఏళ్లకేళ్లు గడుస్తున్నా సంతానం మాత్రం కలుగలేదు. దీంతో దంపతులిద్దరూ చాలా ఆవేదన చెందేవారు. ఒకరోజు దంపతులిద్దరూ సంతాన భాగ్యం కోసం తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఒక శుభ ముహూర్తం చూసుకుని ఇద్దరూ తీర్థయాత్రకు బయలుదేరారు.
 
దంపతులిద్దరూ కొంతదూరం వెళ్లాక వారికి ఒక సాధువు దర్శనం అయింది. మహర్షి ధ్యానంలో ఉండటాన్ని చూడగానే దంపతులిద్దరూ ఆయన ఆశీర్వాదం కోసం ఆగారు. కాసేపటి తరువాత మహర్షి ధ్యానం పూర్తైంది. రుషికి దంపతులు నమస్కరించడంతో ఆయన సంతోషించాడు. తమ బాధను రుషికి దంపతులు వివరించారు. శని ప్రదోష పూజ చేసిన వారికి గత జన్మలో చేసిన పాపాలు పోవడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. 
 
వారు పడుతున్న బాధ చూశాక వారికి శని త్రయోదశి ఉపవాసం, దాని ప్రాముఖ్యత గురించి రుషి వివరించాడు. వ్రతాన్ని ఆచరించమని సలహా ఇచ్చాడు. తీర్థయాత్రల నుంచి తిరిగొచ్చాక దంపతులిద్దరూ శని ప్రదోష వ్రతాన్ని ఆచరించి శివుడిని పూజించారు. కొంత కాలానికి వ్యాపారి దంపతులకు సంతానం కలిగింది. శనిత్రయోదశి నాడు నిర్వహించే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది.