గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-02-2022 - గురువారం మీ రాశి ఫలితాలు - కుబేరుడిని పూజిస్తే..?

కుబేరుడిని ఆరాధించిన పురోభివృద్ధి పొందుతారు. 
 
మేషం:- ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థికలావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.
 
వృషభం :- కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్ధం చేసుకుంటారు. కుంటుంబం లోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ముఖ్యుల రాకపోకలు అధికవుతాయి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
మిధునం:- బంధు మిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు సంభవం. పనులు వాయిదా వేసిన ఇబ్బందులకు గురవుతారు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. .
 
కర్కాటకం:- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
సింహం:- స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఆత్మీయుల సహాయ, సహకారాలు లభిస్తాయి. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ పురోభివృద్ధిని, ఖ్యాతిని గుర్తించి కొనియాడతారు.
 
కన్య:- ధనవ్యయం, రుణ సహాయానికి సంబంధించిన విషయాల్లో కుటుంబీకులను సంప్రదించటం మంచిది. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించి భంగపాటుకు గురవుతారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
 
తుల:- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. బంధువుల రాకపోకలు అధికంగా ఉంటాయి. ధనవ్యయం అధికంగా ఉన్నా ఇబ్బందులుండవు. కోర్టు వ్యవహారాల్లో చికారులు తప్పవు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది.
 
వృశ్చికం:- రుణయత్నంలో ఆటంకాలు తొలగిపోయి మార్గం సుగమం కాగలదు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. స్త్రీలకు విలువైన వస్తువులు, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూరప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
ధనస్సు: - ట్రాన్స్ పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ పురోభివృద్ధిని, ఖ్యాతిని గుర్తించి కొనియాడుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. స్థిర చరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో చర్చలు జరుపుతారు.
 
మకరం: - ఆర్థికంగా పురోగమిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి, స్పెక్యులేషన్ సామాన్యంగా ఉంటుంది. రుణయత్నంలో ఆటంకాలు తొలగిపోయి మార్గం సుగమం కాగలదు.
 
కుంభం: - పత్రిక రంగంలో వారికి, శాస్త్రజ్ఞులకు, వైజ్ఞానిక రంగాల్లో వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
 
మీనం:- గృహమునకు కావలసిన విలువైన వస్తువులు అమర్చుకుంటారు. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదవకాశాలు లభించగలవు. దూరప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు.