సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-02-2022 మంగళవారం రాశిఫలితాలు - కార్తీకేయుడిని పూజించిన శుభం...

మేషం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు.
 
వృషభం :- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. సోదరీ, సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు. కనిపించకుండా పోయిన విలువైన పత్రాలు, రశీదులు తిరిగి లభిస్తాయి.
 
మిథునం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. యాదృచ్చికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గొప్ప గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కర్కాటకం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. గృహనిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.
 
సింహం :- చేతివృత్తుల వారికి అవకాశం లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. ముఖ్యులను కలుసుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ఏ యత్నం కలిసి రాకపోవడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. తలపెట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తులు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
తుల :- గృహంలో పనులు పూర్తి చేయ గలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరుల విషయంలో తప్పిదాలు లెక్కించక సంయమనం పాటించండి. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది.
 
వృశ్చికం :- ప్రత్తి, పొగాకు రైతులకు నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. ఆగిపోయిన పనులు పునః ప్రారంభిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధ కూడదు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. సన్నిహితుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. మీ కళత్ర వైఖరి మీకు చికాకులను కలిగిస్తుంది.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. రుణం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఉమ్మడి నిధుల నిర్వహణలో మాటపడాల్సివస్తుంది.
 
మకరం :- వృత్తి, వ్యాపారులకు కలిసివస్తుంది. దూర ప్రయాణులలో సూతన పరిచయాలు ఏర్పడతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతతాయి. మిమ్మల్ని అభిమానించే ఆత్మీయులను బాధపెట్టడం మంచిది కాదని గమనించండి.
 
కుంభం :- స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
మీనం :- ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ముఖ్యులలో వచ్చిన మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. దైవసేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. కుటంబీకులతో అవగాహన లోపిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. మీ సంతానం మొండి వైఖరి చికాకు కలిగిస్తుంది.